లక్నో, అక్టోబర్ 7: మనుషులు పాముల్లా మారిపోవడం నాగిన్ సినిమాలోనూ, నాగిని సీరియల్లోనూ మనం చూశాం. కానీ తన భార్య రాత్రి సమయాల్లో పాముగా మారిపోయి, తనను కాటేయడానికి ప్రయత్నిస్తున్నదని యూపీకి చెందిన ఒక వ్యక్తి లబోదిబోమంటూ ఒక అసాధారణ ఫిర్యాదు చేయడంతో స్పందించిన అధికారులు దానిపై విచారణకు ఆదేశించారు. మేరజ్ అనే వ్యక్తి జిల్లా మేజిస్ట్రేట్‌కు రాసిన లేఖలో ‘సార్.. దయుంచి నా భార్య నుంచి నన్ను కాపాడండి. రాత్రి పూట ఆమె పాములా మారిపోయి నన్ను కాటేస్తున్నది. అయితే నేను మెలకువగా ఉన్న సమయంలో కాటేయడం లేదు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని నేను నిద్రకూడా పోవడం లేదు’ అంటూ ఫిర్యాదుల కార్యక్రమంలో విజ్ఞప్తి చేశాడు.