న్యూఢిల్లీ: పెహల్గామ్లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. మతం ఆధారంగా పర్యాటకుల్ని చంపినట్లు కొందరు సాక్ష్యులు చెబుతున్నారు. కలిమా(Kalima) చదవలేదని కూడా చంపేసినట్లు కొందరు పేర్కొన్నారు. ఆ ఉగ్రవాద దాడిలో సుమారు 26 మంది మరణించారు. ఇంతకీ కలిమా అంటే ఏంటి. ఇస్లాం మతంలో దేవుడిని ప్రార్థించే మంత్రం అది. లా ఇలాహ్ ఇల్లాహ్, మొహమ్మదుర్ రసూలుల్లా అని పలకడాన్ని కలిమా అంటారు. దేవుడు లేడు కానీ అల్లా ఉన్నాడని దీని అర్థం. అల్లాకు శాంతిదూతయే మొహమ్మద్ అని అర్థం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ముస్లింలు అల్లాను పవిత్రంగా పూజిస్తారు.
పుట్టిన శిశువుల చెవుల్లో కలిమా సూక్తులను వినిపిస్తారు. రోజుకు అయిదుసార్లు ముస్లింలు తమ ప్రార్థనల్లో వాటిని వల్లిస్తారు. చావుకు దగ్గరైన వారి పెదవులపై కలిమా వ్యాఖ్యలు ఉంటాయని భావిస్తుంటారు. దేవుడు ఒక్కడే అన్న నమ్మకాన్ని వ్యక్తం చేయడం అని, ఆయన తుది దూతే మహమ్మద్ ప్రవక్త అని చెబుతారు. కలిమా అరబిక్ భాషా పదం. దానికి పదం అన్న అర్థం ఉన్నది. ఇస్లాం మతంలో ఆరు కలిమాలు ఉన్నాయి.
కలిమా తయ్యిబ్, కలిమ షాహద, కలిమా తమ్జీద్, కలిమా తవహీద్, కలిమా అస్టఘ్ఫర్, కలిమా రాద్దే కూఫిర్ అనే ఆరు కలిమాలు ఉన్నాయి. ఇస్లాం మత విశ్వాసాలకు కలిమాలే కేంద్ర బిందువులు. అల్లా ఒక్కరే అని ముస్లింలకు బోధిస్తారు. ప్రవక్త గురించి వివరిస్తారు. క్షమాపణలు కోరుతూ కలిమా వల్లిస్తారు. తప్పుల నుంచి దూరంగా ఉంటారు. విస్వాశాన్ని పెంచే రీతిలో ముస్లింలలో వీటిని చదువుతుంటారు.
కలిమా చదవడం వల్లే తనను కాల్చకుండా ఉగ్రవాదులు వదిలేసినట్లు అస్సాంకు చెందిన దేబశిష్ భట్టాచార్య తెలిపారు. ఉగ్రవాది తనపై తుపాకీ ఎక్కి పెట్టినపుడు గట్టిగా కలిమా చదవినిట్లు ఢాక్టర్ భట్టాచార్యా పేర్కొన్నారు. నా చుట్టూ ఉన్న వారంతా కలిమా చదివారని, నును కూడా వారితో కలిమా సూక్తులు వల్లించానన్నారు.
కలిమా తెలియదని, చదవడం రాదు అని తన తండ్రి చెప్పడంతో అతన్ని తన ముందే కాల్చి చంపారని కేరళకు చెందిన ఆర్తి మీనన్ తెలిపారు. కొచ్చికి చెందిన రామచంద్రన్ తన కూతురు ఆర్తి, మనవళ్లతో కలిసి కశ్మీర్ టూరుకు వెళ్లారు. కానీ పెహల్గామ్ ఉగ్రదాడిలో రామచంద్రన్ ప్రాణాలు కోల్పోయాడు. కలిమా చదవలేదని అతన్ని షూట్ చేశారు. ఉగ్రవాదుల తమ వద్దకు వచ్చి అందర్నీ కింద పడుకోమని చెప్పారని, గ్రూపులుగా ఉన్న ఉగ్రవాదులు, ఏవో ప్రశ్నలు వేస్తూ కాల్చేశారని, మా వద్దకు వచ్చి కలిమా వల్లించాలని అడిగారని, మాకు రాదు అని చెప్పడంతో మా నాన్నను చంపేశారని ఆరతి చెప్పింది. తన తలపై గన్ పాయింట్ చేయగానే పిల్లలు ఏడ్చారని, అప్పుడు అక్కడ నుంచి ఉగ్రవాదులు వెళ్లిపోయినట్లు ఆరతి తెలిపింది.
“They asked my father to recite the Kalima. When he said he didn’t know it, they shot him. They placed the gun on my head too. I think they let me go only because the children were crying,” says Arathi, daughter of Ramachandran, who was brutally killed in a terrorist attack.
If… pic.twitter.com/vKFiOwiBkV
— Pratheesh Viswanath (@pratheesh_Hind) April 24, 2025