భద్రాచలం : పురుగుల మందు తాగి ఓ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో(Bhadrachalam) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..అశ్వాపురం మండలానికి చెందిన ఓ బాలిక, కుకునూరు మండలం రావి గూడెం గ్రామానికి చెందిన రవి (35) అనే వ్యక్తితో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంటనే వారిని ప్రభుత్వ దవాఖానకు తరలించగా రవి మృతి చెందాగా చికిత్స పొందుతూ సదరు బాలిక మరణించింది.
వీరిద్దరు నిన్న(గురువారం) లాడ్జిలో బస చేశారు. అనంతరం పురుగుల మందు తాగారు. కాగా, రవి అనే వ్యక్తికి గతంలోనే వివాహం జరిగి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మైనర్ ప్రస్తుతం 8వ తరగతి చదువుతోంది. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందని, అందుకే ఆత్మహత్యకు ప్రయత్నించారని బాధితుల బంధువులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.