Badlapur | మహారాష్ట్రలోని థాణే జిల్లా బద్లాపూర్ (Badlapur)లో నర్సరీ చదువుతున్న ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటన (Sexual Assault Case) తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ప్రజల్లో ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. చిన్నారులపై లైంగిక వేధింపులకు ఒడిగట్టిన కీచకుడిపై, పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం ఉదయం తల్లిదండ్రులు స్థానికులు పాఠశాల వద్ద నిరసన తెలిపారు. కొందరు ఆగ్రహంతో పాఠశాలపై దాడికి పాల్పడి వస్తువులు ధ్వంసం చేశారు. అదేవిధంగా వందలాది మంది స్థానికులు రైల్వే స్టేషన్ను దిగ్బంధనం చేశారు.
ఈ ఘటనపై స్థానిక ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష ‘మహావికాస్ అఘాడి’ (Maha Vikas Aghadi) కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారులపై లైంగిక దాడి ఘటనకు నిరసనగా రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది (Maharashtra Bandh). ఈ మేరకు శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) ఆగస్టు 24, శనివారం మహారాష్ట్ర బంద్ ప్రకటించారు.
‘త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు గురించి చర్చించబోతున్నాం. అదేవిధంగా బద్లాపూర్ ఘటన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలపై చర్చిస్తాం. చిన్నారులపై లైంగిక వేధింపులకు నిరసన తెలిపిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై మహారాష్ట్ర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేము బద్లాపూర్ ఘటనపై ఆగస్టు 24న రాష్ట్ర బంద్కు పిలుపునివ్వాలని నిర్ణయించాం’ అని సంజయ్ రౌత్ తెలిపారు.
24 August
Maharashtra bandh!
महाराष्ट्र बंद!!!
महाविकासआघाडीचे ठरले. pic.twitter.com/tC8GVVgCIH— Sanjay Raut (@rautsanjay61) August 21, 2024
Also Read..
Cobra | వాషింగ్ మెషీన్లో నాగుపాము ప్రత్యక్షం.. షాకింగ్ వీడియో
Cars recall | లక్షకుపైగా కార్లను వెనక్కి తీసుకుంటున్న కియా, టెస్లా కంపెనీలు.. ఎందుకంటే..!
Subramanian Swamy: ప్రధాని మోదీకి వార్నింగ్ ఇచ్చిన బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి