Cars recall | లక్షకుపైగా కార్లను వెనక్కి తీసుకుంటున్న కియా, టెస్లా కంపెనీలు.. ఎందుకంటే..!
Cars recall | కియా, టెస్లాతోపాటు మరో రెండు కార్ల కంపెనీలు లక్షకు పైగా కార్లను వెనక్కి తీసుకోనున్నాయి. ఆయా కంపెనీల కార్లలో లోపాల కారణంగా కంపెనీలు వాటిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ విషయాన్ని దక్షిణకొరియా రవాణా మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది.
Cars recall : కియా, టెస్లాతోపాటు మరో రెండు కార్ల కంపెనీలు లక్షకు పైగా కార్లను వెనక్కి తీసుకోనున్నాయి. ఆయా కంపెనీల కార్లలో లోపాల కారణంగా కంపెనీలు వాటిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ విషయాన్ని దక్షిణకొరియా రవాణా మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. కార్లను రీకాల్ చేస్తున్న నాలుగు కంపెనీల్లో టెస్లా, కియాతోపాటు ఫోర్డ్ మోటార్, జీఎం ఏసియా పసిఫిక్ కూడా ఉన్నాయి.
నాలుగు కంపెనీలకు సంబంధించిన ఏడు మోడల్స్‌లో 1,03,543 కార్లలో లోపాలు ఉన్నట్లు ఆయా కంపెనీలు గుర్తించాయి. టెస్లా కంపెనీ కార్లలోని మోడల్ Y లో సాఫ్ట్వేర్ లోపం ఉందని నిర్ధారణ అయ్యింది. కియా ప్రైడ్ కాంపాక్ట్ కారులోని హైడ్రాలిక్ ఎలక్ట్రిక్ కంట్రోల్ యూనిట్లో డ్యూరెబిలిటీ లేకపోవడంతో వెనక్కి తీసుకుంటున్నారు. అదేవిధంగా ఫోర్డ్ కంపెనీకి చెందిన Lincoln MKX SUV కారులో బ్రేక్ బూస్టర్‌లో లోపం ఉంది. జీఎం ఏసియా పసిఫిక్ కంపెనీకి చెందిన Cadillac Lyriq all-electric sedan కారులో ఎలక్ట్రిక్ బ్రేక్ కంట్రోల్ మాడ్యూల్లో సమస్య ఉంది.
వాహన యజమానులు www.car.go.kr వెబ్సైట్ ద్వారాగానీ, 080-357-2500 నెంబర్‌కు కాల్ చేయడం ద్వారాగానీ తమ కారు రీకాల్ లిస్టులో ఉందో.. లేదో తెలుసుకోవచ్చని దక్షిణ కొరియా రవాణా మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ నెల ఆరంభంలో కూడా బీఎండబ్ల్యూ కొరియా, హుందాయ్ మోటార్, రెండు ఇతర కంపెనీలు తయారీ లోపాల కారణంగా స్వచ్ఛందంగా 1,72,000 వాహనాలను వెనక్కి తీసుకున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

