న్యూఢిల్లీ : తన ఆస్తిని పూర్తిగా తన కుమార్తెకు ఇవ్వడానికి భారతీయ వారసత్వ చట్టాన్ని అనుసరించేందుకు అనుమతి ఇవ్వాలని కేరళ మహిళ సఫియా సుప్రీంకోర్టును మంగళవారం కోరారు. తనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారని; కుమారుడు ఆటిజంతో బాధపడుతున్నాడని చెప్పారు. అతని సంరక్షణ బాధ్యతలను తన కుమార్తె చూసుకుంటున్నదని తెలిపారు. తన కుమారుడు డౌన్ సిండ్రోమ్ వల్ల మరణిస్తే, షరియా ప్రకారం కుమార్తెకు తన ఆస్తిలో మూడో వంతు మాత్రమే వస్తుందని, ఈ నేపథ్యంలో తన ఆస్తి పంపకాల కోసం భారతీయ వారసత్వ చట్టాన్ని అనుసరించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.