ముంబై: రైలులో ప్రయాణించిన ముస్లిం వృద్ధుడిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. (elderly man assaulted in train) గొడ్డు మాంసం తీసుకెళ్తున్నాడన్న అనుమానంతో అతడ్ని కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ వృద్ధుడ్ని కొట్టిన వ్యక్తుల్లో కొందరిని గుర్తించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. జల్గావ్ జిల్లాకు చెందిన హాజీ అష్రఫ్ మున్యార్, కళ్యాణ్‌లోని తన కుమార్తె ఇంటికి వెళ్లేందుకు ఇటీవల ధులే ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించాడు. నాసిక్ జిల్లాలోని ఇగత్పురి సమీపంలో పది మందికిపైగా ప్రయాణికులు తొలుత సీటు విషయంపై ఆ వృద్ధుడితో వాగ్వాదానికి దిగారు. సీసాల్లో గొడ్డు మాంసం తీసుకెళ్తున్నాడనే అనుమానంతో అతడ్ని వేధించారు. తాను తీసుకెళ్తున్నది మేక మాంసమేనని, గొడ్డు మాంసం కాదని ఆ వృద్ధుడు చెప్పినప్పటికీ వారు విడిచిపెట్టలేదు. అతడ్ని వేధించడంతోపాటు కొట్టారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) స్పందించారు. ముస్లిం వృద్ధుడిపై దాడి చేసిన వారిలో కొందరు వ్యక్తులను గుర్తించినట్లు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శనివారం వెల్లడించారు.
Haji Ashraf Munyar from a village in Jalgaon District travelling in a train to Kalyan to meet his daughter was abused and badly beaten up by goons in a train near Igatpuri alleging him of carrying beef. pic.twitter.com/uOr3vlqBqB
— Mohammed Zubair (@zoo_bear) August 30, 2024