న్యూఢిల్లీ: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ్‌కు.. రకరకాల సాధువులు హాజరవుతున్నారు. అనేక సాధు గ్రూపులు అక్కడ క్యాంపులు కూడా ఏర్పాటు చేశాయి. అయితే ఓ విదేశీ సాధువు కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఆత్మ ప్రేమ్ గిరి మహారాజ్ అనే సాధువు అందర్నీ తన లుక్స్‌తో స్టన్ చేస్తున్నాడు. మస్క్యూలార్ బాబా.. కండల బాబా(Muscular Baba)గా ఆయన్ను అందరూ పిలుస్తున్నారు.
ఏడు అడుగుల ఎత్తు ఉన్న ఆ బాబా.. కాషాయం దుస్తుల్లో చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాడు. మెడలో, చేయిల చుట్టూ రుద్రాక్షలు చుట్టి.. గంభీరమైన లుక్ ఇస్తున్నాడు. ఆధునిక యుగానికి చెందిన పరుశరాముడు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. హిందూ మత పౌరాణికాల్లో పరుశరాముడికి ప్రత్యేక గుర్తింపు ఉన్నది. యోధుడి లక్షణాలు ఉన్నట్లు అతని శరీర నిర్మాణం ఉన్నది.
వాస్తవానికి గిరి మహారాజ్ది.. రష్యా. 30 ఏళ్ల క్రితమే ఆయన హిందూ మతాన్ని స్వీకరించారు. అప్పటి నుంచి ఆ మత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు ఈయన టీచర్‌గా చేశారు. ప్రొపెషనల్ కెరీర్‌ను వదిలేసిన ఆయన.. ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకున్నారు. ప్రస్తుతం గిరి మహారాజ్ బాబా నేపాల్ ఉంటున్నాడు. జునా అకాడాలో సభ్యుడిగా కూడా ఉన్నాడు. హిందూ ధర్మ ఆచారాల్లో జునా అకాడాకు విశిష్టమైన స్థానం ఉన్నది.
అయితే ఓ యూజర్ ఆ కండల బాబాకు చెందిన ఫోటోను తన ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. ఖతర్నాక్ ఫిజిక్‌తో ఆకట్టుకుంటున్న ఆ బాబా ఫోటోకు తెగ లైక్‌లు వచ్చేస్తున్నాయి. హర్ హర్ మహాదేవ్ అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.