న్యూఢిల్లీ : దృశ్యం సినిమా తరహాలో మరో హత్య జరిగింది. అహ్మదాబాద్లో ఏడాది క్రితం జరిగిన ఈ హత్య కేసును పోలీసులు తాజాగా ఛేదించారు. ఏడాది క్రితం నుంచి తప్పిపోయాడని భావిస్తున్న బాధితుడు సమీర్ అన్సారీ (35) మృతదేహాన్ని వంటగది ఫ్లోరింగ్ కింద కనుగొన్న పోలీసులు షాక్ తిన్నారు.
వివాహేతర సంబంధం గురించి భర్తకు తెలియడంతో ప్రియుడితో కలిసి భార్య అతడిని గొంతుకోసి చంపి, వంటగదిలో గొయ్యి తీసి పాతిపెట్టినట్టు దర్యాప్తులో తేలింది.