డెహ్రాడూన్: సోషల్ మీడియా రీల్ కోసం ఒక మహిళ ప్రయత్నించింది. మొబైల్ ఫోన్లో వీడియో రికార్డ్ చేయాలని తన కుమార్తెకు చెప్పింది. నదిలోకి దిగి ఫోజులిచ్చింది. అయితే జారి పడిన ఆమె ప్రవాహానికి నదిలో కొట్టుకుపోయింది. (Woman Drowns While Making Reel) ఇది చూసి ఆమె కుమార్తె షాక్ అయ్యింది. అమ్మా అమ్మా అంటూ అరిచింది. ఉత్తరాఖండ్‌లో ఈ సంఘటన జరిగింది. నేపాల్‌కు చెందిన 35 ఏళ్ల మహిళ తన కుటుంబంతో కలిసి ఉత్తరకాశీలోని బంధువుల ఇంటికి వచ్చింది. ఏప్రిల్ 14న తన 11 ఏళ్ల కుమార్తెతో కలిసి మణికర్ణిక ఘాట్‌ను ఆమె సందర్శించింది.
కాగా, అక్కడ రీల్ కోసం ఆ మహిళ ప్రయత్నించింది. వీడియో రికార్డ్ చేయాలంటూ కుమార్తెకు మొబైల్ ఫోన్ ఇచ్చింది. ఆ తర్వాత భాగీరథి నదిలోకి ఆ మహిళ దిగింది. ఫోజులిస్తున్న ఆమె ఉన్నట్టుండి నదిలో జారిపడింది. నదీ ప్రవాహంలో ఆమె కొట్టుకుపోయింది. ఇది చూసి మహిళ కుమార్తె ఆందోళన చెందింది. మమ్మీ, మమ్మీ అంటూ అరించింది.
మరోవైపు గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో గల్లంతైన ఆ మహిళ కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నదిలోకి దిగిన ఆ మహిళ జారిపడి కొట్టుకుపోయిన షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
आजकल लोग सोशल मीडिया पर रील्स बनाने के लिए अपनी जान को भी जोखिम में डाल रहे हैं।
उत्तराखंड के उत्तरकाशी घूमने आई नेपाल मूल की एक महिला मर्णिकाघाट पर रील बनाते समय भागीरथी नदी में गिरकर बह गई।
रेस्क्यू टीम ने काफी तलाश की, लेकिन महिला का अब तक कोई सुराग नहीं मिला है। pic.twitter.com/7lDs66iZP7— SA News Uttarakhand (@SANewsUK) April 16, 2025