Iconic Racecourse | ఐకానిక్ మహాలక్ష్మీ రేస్‌కోర్స్ కనుమరుగు.. అదే స్ధలంలో థీమ్ పార్క్ ఏర్పాటుకు సన్నాహాలు
Iconic Racecourse : దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ప్రతిష్టాత్మక మహాలక్ష్మీ రేస్ కోర్స్ ప్రాభవానికి తెరపడనుంది. ముంబై వాంఖడే స్టేడియంకు దీటుగా మహాలక్ష్మి రేస్ కోర్స్ నగర ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలు, సెలబ్రిటీలకు విలాస, విహార కేంద్రంగా పేరొందింది.
Iconic Racecourse : దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ప్రతిష్టాత్మక మహాలక్ష్మీ రేస్ కోర్స్ ప్రాభవానికి తెరపడనుంది. ముంబై వాంఖడే స్టేడియంకు దీటుగా మహాలక్ష్మి రేస్ కోర్స్ నగర ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలు, సెలబ్రిటీలకు విలాస, విహార కేంద్రంగా పేరొందింది. ముంబై మహాలక్ష్మి రేస్‌కోర్స్‌లో ఏటా అతిపెద్ద హార్స్ రెసింగ్ ఈవెంట్ ముంబై డెర్బీకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది.
క్రికెట్ తరహాలోనే హార్స్ రేసింగ్‌కు పెద్దసంఖ్యలో ఔత్సాహికులు, నగరంలో ప్రముఖ సోషలైట్స్, పరిశ్రమల అధిపతులు, బాలీవుడ్ స్టార్లు ఈ రేస్‌కోర్స్‌కు పోటెత్తుతుంటారు. 140 ఏండ్ల నాటి ఈ రేస్‌కోర్స్ ప్రాభవం ఇక కనుమరుగవనుంది. 225 ఎకరాల ఈ గ్రౌండ్‌పై పట్టు కోసం మహాలక్ష్మి రేస్‌కోర్స్‌ను నిర్వహిస్తున్న రాయల్ వెస్ట్రన్ ఇండియా టర్ఫ్ క్లబ్ (ఆర్డబ్ల్యూఐటీసీ) బ్రుహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మధ్య కోల్డ్‌వార్ సాగుతోంది. ఈ గ్రౌండ్‌పై 99 ఏండ్ల లీజ్ 2013లోనే ముగిసింది.
ఇక అప్పటినుంచి ముంబై నడిబొడ్డున ఉన్న రేస్‌కోర్స్ ఉనికి ప్రశ్నార్ధకంగా మారింది. ఇక రేస్‌కోర్స్‌ను ఆ ప్రాంతం నుంచి తరలించి అక్కడ థీమ్ పార్క్ ఏర్పాటు చేయాలని బీఎంసీ, మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రతిష్టాత్మక రేస్కోర్స్పై నీలినీడలు అలుముకున్నాయి. బీఎంసీ ప్రతిపాదనపై ఆర్డబ్ల్యూఐటీసీలోని ఓ వర్గం, శివసేన (యూబీటీ) సహా రాజకీయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది ముంబైకి ఆక్సిజన్ వంటిదని, పచ్చదనంతో కూడిన ఈ మైదానాన్ని తరలించేందుకు తాము అంగీకరించబోమని ఆయా వర్గాలు తేల్చిచెబుతున్నాయి. ఏమైనా ముంబైకి వన్నెతెచ్చిన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాంగణాల్లో ఒకటైన మహాలక్ష్మి రేస్‌కోర్స్ భవితవ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది.
Read More :
President Murmu | బడ్జెట్ సమావేశాలు.. గుర్రపు బగ్గీలో పార్లమెంట్‌కు వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

