Mumbai Train Blast | 2006 నాటి ముంబయి లోకల్ రైలు పేలుళ్ల కేసులో 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. హైకోర్టు నిర్ణయం దిగ్భ్రాంతికరమని పేర్కొన్నారు. హైకోర్టు ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ప్రాసిక్యూషన్‌ను మందలించి. సాక్ష్యం, గుర్తింపు పరేడ్ ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తింది. అదే సమయంలో కోర్టు అందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ.. రూ.25వేల వ్యక్తిగత బాండ్‌పై విడుదల చేయాలని ఆదేశించింది.
2006 ముంబై రైలు పేలుళ్లలో 187 మంది మరణించారు. 800 మందికిపైగా గాయపడ్డారు. ఈ కేసులో దిగువ కోర్టు 12 మంది నిందితుల్లో ఐదుగురికి మరణశిక్ష, ఏడుగురికి జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో ఒకరిని నిర్దోషిగా ప్రకటిస్తూ అప్పట్లో తీర్పును వెలువరించింది. నిందితులు కోర్టు నిర్ణయాన్ని హైకోర్టును ఆశ్రమించారు. అలాగే, మహారాష్ట్ర ప్రభుత్వం సైతం నిందితుల పిటిషన్‌ను సవాల్ చేసింది. 2015 నుంచి పిటిషన్లపై విచారణ పెండింగ్‌లో ఉన్నది.
పలుసార్లు కోర్టు దృష్టికి తీసుకురాగా.. 2024 జులైలో రోజువారి విచారణ కోసం హైకోర్టు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే విచారణ జరుపుతూ వచ్చిన కోర్టు సోమవారం అందరినీ దోషులుగా ప్రకటించింది. నిందితులను దోషులుగా ప్రకటించడంలో ట్రయల్ కోర్టు లోపభూయిష్టంగా వ్యవహరించిందని, అభియోగాలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని న్యాయస్థానం పేర్కొంది. 2006 జులై 11న ముంబయి సబర్బన్ రైళ్లలో వరుసగా బాంబు పేలుళ్లు సంభవించాయి.
ఈ ఘటనలో 189 మంది చెందారు. ఈ మారణ హోమంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జనం తిరిగి ఇండ్లకు రైలులో బయలుదేరిన సమయంలో సాయంత్రం 6.24 గంటల ప్రాంతంలో పేలుళ్లు జరిగాయి. ఏడుచోట్ల పేలుళ్లు జరుగడంతో ముంబయి వణికిపోయింది. ఆర్డీఎక్స్, అమ్మోనియం నైట్రేట్లను ప్రెషన్ కుక్కర్లలో ప్యాక్ చేసి తీసుకెళ్లినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది.