Bomb Threat | దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఓ పాఠశాలకు (Mumbai school) బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపాయి. నగరంలోని జోగేశ్వరి – ఓషివారా ప్రాంతంలో (Jogeshwari-Oshiwara area) గల పాఠశాల ఆవరణలో బాంబు పెట్టామంటూ ఇవాళ బెదిరింపు మెయిల్ వచ్చింది. బెదిరింపు మెయిల్‌తో వెంటనే అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది.
రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్ స్క్వాడ్ (bomb squad), డాగ్ స్క్వాడ్ బృందంతో పాఠశాలకు చేరుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ సోదాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. బెదిరింపు మెయిల్‌ను పంపిన వ్యక్తి అందులో అఫ్జల్ గ్యాంగ్ పేరును ప్రస్తావించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Also Read..
Cabs Rates | ఒకే సర్వీసుకు రెండు వేర్వేరు ఛార్జీలు.. ఉబర్, ఓలాకు కేంద్రం నోటీసులు
Adar Poonawala | వారానికి 90 గంటల పని విధానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అదార్ పూనావాలా..!
iPhone Issues: ఐఫోన్ పర్ఫార్మెన్స్లో సమస్యలు.. యాపిల్ సంస్థకు కేంద్రం నోటీసులు