ముంబై: పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీని బెదిరిస్తూ ఈ-మెయిల్స్ పంపిన ఇద్దరు యువకులను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు వరంగల్‌కు చెందిన గణేశ్ రమేశ్ వన్రపతి (19) కాగా, మరొకరు గుజరాత్‌కు చెందిన షాదాబ్ ఖాన్ (21). వేర్వేరు ఈ-మెయిల్స్ ద్వారా వీరు అంబానీకి బెదిరింపు లేఖలు పంపినట్టు అధికారులు తెలిపారు.
అక్టోబర్ 27న తొలి మెయిల్ పంపారు. రూ.20 కోట్లు చెల్లించాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. ఆ మర్నాడే మరో ఈ-మెయిల్ వచ్చింది. ఈ సారి రూ.200 కోట్లు డిమాండ్ చేశారు. మరొక ఈ-మెయిల్లో రూ.400 కోట్లు ఇవ్వాలని బెదిరించారు. దీనిపై ముంబైలోని గమ్దేవ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.