ముంబై, సెప్టెంబర్ 28: పండుగలు, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముంబైలో ఉగ్రవాద దాడులకు అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. దీంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. రద్దీ ప్రదేశాలు, ఎక్కువ ప్రజలు వచ్చే ప్రార్థనా స్థలాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
బాంబ్ స్వాడ్‌తో నగరాన్ని జల్లెడ పడుతున్నారు. నగరంలోని డీసీపీలు స్వయంగా వారి పరిధుల్లో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. క్రాఫోర్డ్ మార్కెట్‌తో పాటు పలు కీలక ప్రాంతాల్లో పోలీసులు సెక్యూరిటీ డ్రిల్ నిర్వహించారు.