Air India | మహిళపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు..!
ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన 34 ఏళ్ల శంకర్ మిశ్రా నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించాడు. బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేసిన అతడు మద్యం మత్తులో ఒక వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం కాస్తా ఇటీవల వెలుగులోకి రావడంతో ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.
Air India | ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన 34 ఏళ్ల శంకర్ మిశ్రా నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించాడు. బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేసిన అతడు మద్యం మత్తులో ఒక వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం కాస్తా ఇటీవల వెలుగులోకి రావడంతో ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. అదృశ్యమైన శంకర్ మిశ్రాను అరెస్ట్ చేసేందుకు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టాయి. ఈ నేపథ్యంలో శనివారం బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
కాగా, ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత శంకర్ మిశ్రాని అమెరికా కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. అమెరికా ఆర్థిక సేవల సంస్థ వెల్స్ ఫార్గోలో భారత్ వైస్ ప్రెసిడెంట్గా శంకర్ మిశ్రా పని చేస్తున్నాడు. అయితే మహిళా ప్రయాణికురాలిపై అతడు మూత్ర విసర్జన చేసిన విషయం ఆ సంస్థకు తెలిసింది. దీంతో ఆయనపై చర్యలు చేపట్టింది. శంకర్ మిశ్రాను తమ సంస్థ నుంచి తొలగించినట్లు పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

