Crime news : అతను ఓ ఫార్మా కంపెనీ (Pharma firm) కి యజమాని. సమావేశం పేరుతో ఒక మహిళా వ్యాపారవేత్త (Business Woman) ను తన కార్యాలయానికి పిలిపించుకున్నాడు. అక్కడ ఆమెను తుపాకీతో బెదిరించి దుస్తులు విప్పించాడు. ఆ తర్వాత ఆమెను నగ్నంగా వీడియోలు తీశాడు. ఇప్పుడు ఆ వీడియోలను అడ్డంపెట్టుకుని లైంగికంగా వేధిస్తున్నాడు. వీడియోలు బయటపెడుతానని బ్లాక్ మెయిల్ (Block mail) చేస్తున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన ఓ మహిళా వ్యాపారవేత్తను ఫ్రాంకో ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ వ్యవస్థాపక సభ్యుడు, మేనేజింగ్ డైరెక్టర్ అయిన జాయ్ జాన్ పాస్కల్ పోస్ట్ లైంగికంగా వేధిస్తున్నాడు. సమావేశం పేరుతో సదరు మహిళా వ్యాపారిని తన కార్యాలయానికి పిలిపించుకున్న జాయ్.. అక్కడ ఆమెను తుపాకీతో బెదిరించి దుస్తులు విప్పించాడు.
అంతేకాదు ఆమెను నగ్నంగా వీడియోలు తీశాడు. ఆపై తన కోరిక తీర్చాలని బలవంతపెట్టాడు. అందుకు ఆమె నిరాకరించడంతో నగ్న వీడియోలు బయటపెడతానని బెదిరించాడు. అందుకు అతనికి మరో నలుగురు వ్యక్తులు సహకరించారు. ఈ ఘటనపై సదరు మహిళా వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.