రూర్కెలా: బీజేపీ పాలిత ఒడిశాలో ఎంటెక్, బీటెక్ చదివిన అభ్యర్థులు, ఇతర కోర్సుల్లో పీజీలు చేసిన ఉన్నత విద్యావంతులు హోంగార్డు ఉద్యోగంలో చేరారు. వాస్తవానికి హోంగార్డు ఉద్యోగానికి విద్యార్హత 5వ తరగతే అయినప్పటికీ మంగళవారం రూర్కెలా జిల్లాలో హోంగార్డుగా శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో అనేకమంది పీజీలు, గ్రాడ్యుయేట్లు ఉన్నారు. రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ పరిస్థితికి ఇది అద్దం పడుతున్నది. కాగా, 82 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న 118 మంది హోం గార్డులు పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్నారు. వీరిలో 34 మంది అత్యధిక విద్యావంతులు. ఇంజినీరింగ్లో డిగ్రీ, సోషియాలజీ, ఇతర సబ్జెక్టులలో పీజీ చేసిన వారు ఉన్నారు. ఫిబ్రవరిలో జరిగిన హోంగార్డు నియామకాలకు 10 వేల దరఖాస్తులు వచ్చాయని, వీరిలో చాలా మంది ఉన్నత విద్యావంతులేనని రూర్కెలా ఎస్పీ నితీశ్ వాద్వానీ తెలిపారు.