మీసాలు పెంచుకున్నారంటూ ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను మధ్యప్రదేశ్ పోలీస్ ఉన్నతాధికారులు ఆదివారం సస్పెండ్ చేశారు. రాకేశ్ రాణా… పోలీస్ విభాగంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. పెరిగిన మీసాలను వెంటనే తగ్గించుకోవాలని, ట్రిమ్ చేసుకోవాలని ఉన్నతాధికారులు ఆయనను ఆదేశించారు. అయితే రాకేశ్ రానా ఈ ఆదేశాలను పెడచెవిన పెట్టారు. ఇలా మీసాలు పెంచుకోవడం వల్ల ఇతర ఉద్యోగులపై నెగెటివ్ ప్రభావం పడుతుందని, ట్రిమ్ చేసుకోవాలని ఉన్నతాధికారులు కోరారు. అయినా వినకపోవడంతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులపై రాకేశ్ రాణా స్పందించారు. ‘నేను రాజ్‌పుత్‌ను. ఈ మీసాలు నాకు గర్వకారణం. ఇది నా ఆత్మాభిమానానికి సంబంధించిన అంశం. అందుకే మీసాలు ట్రిమ్ చేసుకోలేదు’ అంటూ స్పష్టం చేశారు.