Loksabha Elections 2024 : దేశంలో యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ ఏమైందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారీ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. రెండు కోట్ల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీసిన జితూ పట్వారీ రాష్ట్రంలో 1.3 కోట్ల మంది నిరుద్యోగులున్నారని అన్నారు. దీనికి బాధ్యులు ఎవరని ఆయన నిలదీశారు.
గోధుమలకు రూ. 2700, ధాన్యానికి రూ. 3100 మద్దతు ధర ఇస్తామని కాషాయ పాలకులు ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదని దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్ ప్రజలు మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పనితీరు మెచ్చి లాడ్లీ బెహనా స్కీమ్ కోసం ఓట్లు వేసినా బీజేపీ మాత్రం అర్హత లేని వ్యక్తిని సీఎంగా అందలం ఎక్కించిందని ఆరోపించారు.
ఇక మధ్యప్రదేశ్లోని 29 ఎంపీ స్ధానాలకు ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13న నాలుగు దశల్లో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. కాగా, 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో 28 స్ధానాల్లో విజయం సాధించగా కాంగ్రెస్ కేవలం ఒక స్ధానంలో గెలుపొందింది. ఇక 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 27 స్ధానాల్లో గెలుపొందగా కాంగ్రెస్ కేవలం 2 స్ధానాలకు పరిమితమైంది.
Read More :
BJP | రైల్వే స్టేషన్లో పట్టుబడ్డ రూ.4 కోట్లు.. బీజేపీ కార్యకర్త అరెస్టు