BJP | రైల్వే స్టేషన్లో పట్టుబడ్డ రూ.4 కోట్లు.. బీజేపీ కార్యకర్త అరెస్టు
తమిళనాడు రాజధాని చెన్నైలోని తాంబరం రైల్వే స్టేషన్లో భారీగా నగదు పట్టుబడింది. బీజేపీ (BJP) కార్యకర్త సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.4 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని తాంబరం రైల్వే స్టేషన్లో భారీగా నగదు పట్టుబడింది. బీజేపీ (BJP) కార్యకర్త సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.4 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. సతీశ్ అనే బీజేపీ కార్యకర్త హోటల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆయన తన సోదరుడు నవీన్, డ్రైవర్ పెరుమాల్తో కలిసి రూ.4 కోట్ల నగదును ఆరు బ్యాగుల్లో చెన్నై నుంచి తిరునల్వేలీ వెళ్తున్నారు. ఈ క్రమంలో తాంబరం స్టేషన్ వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది రైలులో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
తిరునల్వేలి బీజేపీ ఎంపీ అభ్యర్థి నైనార్ నాంగెన్థిరన్ ఆదేశాల మేరకే డబ్బును తరలిస్తున్నామని చెప్పినట్లు తెలుస్తున్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తమిళనాడులోని 39 లోక్సభ స్థానాలకు ఈ నెల 19న ఎన్నికలు జరుగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

