శనివారం 16 జనవరి 2021
National - Dec 31, 2020 , 10:59:10

గ‌డ్డ‌క‌ట్టిన‌ మౌంట్ అబూ.. మైన‌స్ 4 డ‌గ్రీల ఉష్ణోగ్ర‌త‌

గ‌డ్డ‌క‌ట్టిన‌ మౌంట్ అబూ.. మైన‌స్ 4 డ‌గ్రీల ఉష్ణోగ్ర‌త‌

మౌంట్ అబూ: దేశ‌వ్యాప్తంగా చ‌లి చంపేస్తున్న‌ది.  చాలా చోట్ల ఉష్ణోగ్ర‌త‌లు దారుణంగా ప‌డిపోయాయి.  ఇక రాజ‌స్థాన్‌లోని మౌంట్ అబూలో మాత్రం చ‌లి తీవ్ర‌త విప‌రీతంగా ఉంది.  అక్క‌డ బుధ‌వారం రోజున మైన‌స్ నాలుగు డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు నమోదు అయిన‌ట్లు భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది.  శీతాకాలంలో హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఉండే వెద‌ర్ లాంటి ప‌రిస్థితులు మౌంట్ అబూలో ద‌ర్శ‌నం ఇస్తున్నాయి.  వ‌రుస‌గా గ‌త నాలుగు రోజుల నుంచి క‌నిష్ఠ స్థాయిలో టెంప‌రేచ‌ర్లు న‌మోదు అవుతున్నాయి. రాజ‌స్థాన్‌లోని ప‌ర్వ‌త శ్రేణుల్లో ఉన్న ఏకైన టూరిస్టు సెంట‌ర్ మౌంట్ అబూ కావ‌డం విశేషం. ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోవ‌డంతో స్థానికులు గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్నారు.  కొంద‌రు చ‌లి మంట‌లు కాగుతున్నారు.  ఇక టూరిస్టులు ఆ వెద‌ర్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. తెల్ల‌వారేస‌రికి షిమ్లా త‌ర‌హాలో కురుస్తున్న మంచుతో స్థానికులు మురిసిపోతున్నారు.