న్యూఢిల్లీ : బాలీవుడ్ క్రేజీ నెంబర్‌కు తల్లీ కూతుళ్లు స్టైలిష్ మూమెంట్స్‌తో అదరగొట్టిన వీడియో (viral video) ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. బీవీ నెంబర్ 1 మూవీ నుంచి చునారి చునారి సాంగ్‌కు తల్లీ కూతురు అద్భుతమైన డ్యాన్స్‌తో నెటిజన్లను ఆకట్టుకున్నారు.
ఈ వీడియో ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ పది లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. ఈ వైరల్ క్లిప్‌లో చునారి చునారి సాంగ్‌కు తల్లీ కూతుళ్ల ఎనర్జిటిక్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తోంది.
ఈ వీడియోలో ఇద్దరి డ్యాన్స్ పెర్ఫామెన్స్ హైలైట్‌గా నిలిచినా తల్లి ఏమాత్రం ఎనర్జీ తగ్గకుండా క్రేజీ మూమెంట్స్ ఇచ్చిందని పలువురు నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు. నటి ఈషా గుప్తా సైతం వీరి పెర్ఫామెన్స్‌కు ఫిదా అయింది. చునారి చునారి సాంగ్‌ను సల్మాన్ ఖాన్, సుస్మితా సేన్లపై తెరకెక్కించారు.
Read More :