చెన్నై: తమిళనాడులో కురిసిన భారీ వర్షాల వల్ల ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనైవారి ముట్టల్ జలపాతం వద్ద వరద నీటి ప్రవాహం ఒక్కసారిగిగా పెరింది. దీంతో ఒక తల్లి తన బిడ్డతో సహా అక్కడ చిక్కుకుపోయింది. రాయిని పట్టుకుని ప్రమాదకర స్థితిలో ఉన్న ఆమెను గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.
రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. కొందరు సాహసించి తాళ్ల సహాయంతో ఆ మహిళ వద్దకు చేరారు. ఆ తల్లీబిడ్డను సురక్షితంగా పైకి చేర్చారు. ఈ క్రమంలో ఇద్దరు సిబ్బంది అదుపు తప్పి నీటిలో పడ్డారు. ఈదుతూ అవతల ఒడ్డుకు చేరారు.
కాగా, తల్లీబిడ్డను రెస్క్యూ సిబ్బంది కాపాడిన వీడియో వైరల్ అయ్యింది. వారిని కాపాడటంలో దైర్య సాహసాలు ప్రదర్శించిన సిబ్బందిని సీఎం ఎంకే స్టాలిన్ అభినందించారు. ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేశారు.
தாயையும் சேயையும் காப்பாற்றியவர்களின் தீரமிக்க செயல் பாராட்டுக்குரியது; அரசால் சிறப்பிக்கப்படுவார்கள்.
— M.K.Stalin (@mkstalin) October 26, 2021
தன்னுயிர் பாராது பிறரது உயிர் காக்க துணிந்த அவர்களது தீரத்தில் மனிதநேயமே ஒளிர்கிறது!
பேரிடர்களின்போது பொதுமக்கள் கவனமுடன் இருக்க வேண்டும்.
பண்புடையார்ப் பட்டுண்டு உலகம்! pic.twitter.com/NRCb8OE8l3