లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం యోగి టీమ్ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు జంప్ అయ్యారు. కొందరు బీజేపీ నేతలు సమాజ్‌వాదీలో చేరారు. బీజేపీని వీడిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌరా ఓటమి దిశగా పయనిస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీలో చేరిన ఆయన ఫజిల్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మరో మంత్రి ధరమ్ సింగ్ సైని కూడా యోగి క్యాబినెట్ నుంచి తప్పుకుని ఎస్పీలో చేరారు. అయితే ధరమ్ సింగ్ మాత్రం నాకూర్ నియోజకవర్గం నుంచి లీడింగ్‌లో ఉన్నారు. ఎన్నికలకు ముందు భారీ స్థాయిలో ఎమ్మెల్యేలు కూడా వలస వెళ్లారు. ఎమ్మెల్యేల్లో తిల్హార్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రోషన్‌లాల్ వర్మ ఒక్కరే లీడింగ్‌లో ఉన్నారు. బీజేపీని వదిలి ఎస్పీలో చేరిన మిగితా ఎమ్మెల్యేలు వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది. బ్రిజేష్ ప్రజాపతి(తిండవారి), భగవతి సాగర్(గౌతంపూర్), దారా సింగ్ చౌహాన్(ఘోసి), ముకేశ్ వర్మ(శిఖోబాద్), అవతార్ సింగ్ బాద్నా(జేవర్)లు వెనుకంలో ఉన్నారు.