Rahul Gandhi | వీర్ సావర్కర్ (Veer Savarkar remark)పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో (defamation case) కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి పూణే కోర్టు (Pune court) తాజాగా సమన్లు (Summons) జారీ చేసింది. లండన్ పర్యటన సందర్భంగా సావర్కర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన బంధువు ఒకరు కేసు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు రాహుల్‌కు సమన్లు పంపింది. మే 9న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
మరోవైపు సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు గానూ రాహుల్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీరియస్ అయిన విషయం తెలిసిందే. వినాయక్ దామోదర్ సావార్కర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలను కోర్టు తప్పుపట్టింది. బ్రిటీషర్ల పెన్షన్ తీసుకున్నట్లు సావార్కర్‌పై రాహుల్ ఆరోపించారు. ఈ కేసులో జస్టిస్ దీపాంకర్ దత్తా, మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. స్వాతంత్య్ర సమరయోధుడు సావార్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నట్లు కోర్టు పేర్కొనక్ది. ఒకవేళ రాహుల్ మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అప్పుడు ఆయనపై సుమోటో కేసును నమోద చేసి చర్యలు తీసుకోనున్నట్లు కోర్టు చెప్పింది. అయితే గతంలో మెజిస్ట్రేట్ కోర్టు ఈ కేసులో సమన్లు జారీ చేసింది. ఆ సమన్లపై సుప్రీం స్టే ఇచ్చింది.
Also Read..
“Supreme Court: సావార్కర్‌పై వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు సీరియస్”
Simla Agreement | భారత్ – పాక్ మధ్య ఏమిటీ సిమ్లా ఒప్పందం