Supreme Court: సావార్కర్‌పై వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు సీరియస్
Supreme Court: రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఫ్రీడం ఫైటర్ వినాయక్ దామోదర్ సావార్కర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలను కోర్టు తప్పుపట్టింది. బ్రిటీషర్ల పెన్షన్ తీసుకున్నట్లు సావార్కర్‌పై రాహుల్ ఆరోపించారు.
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు(Supreme Court) సీరియస్ అయ్యింది. వినాయక్ దామోదర్ సావార్కర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలను కోర్టు తప్పుపట్టింది. బ్రిటీషర్ల పెన్షన్ తీసుకున్నట్లు సావార్కర్‌పై రాహుల్ ఆరోపించారు. ఈ కేసులో జస్టిస్ దీపాంకర్ దత్తా, మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. స్వాతంత్య్ర సమరయోధుడు సావార్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నట్లు కోర్టు పేర్కొన్నది. ఒకవేళ రాహుల్ మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అప్పుడు ఆయనపై సుమోటో కేసును నమోద చేసి చర్యలు తీసుకోనున్నట్లు కోర్టు చెప్పింది. అయితే గతంలో మెజిస్ట్రేట్ కోర్టు ఈ కేసులో సమన్లు జారీ చేసింది. ఆ సమన్లపై సుప్రీం స్టే ఇచ్చింది.
సమన్లపై స్టే ఇస్తూ కోర్టు కొన్ని కీలక అభిప్రాయాలు వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీ నానమ్మ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ.. సావార్కర్‌ను పొగుడుతూ లేఖ రాసినట్లు కోర్టు గుర్తు చేసింది. యువర్ ఫేయిత్‌ఫుల్ సర్వెంట్ అన్న పదాన్ని మహాత్మా గాంధీ వాడారని, ఫ్రీడం ఫైటర్‌ను నానమ్మ మెచ్చుకున్న సంగతి ఆయనకు తెలుసా అని కోర్టు ప్రశ్న వేసింది. ఫ్రీడం ఫైటర్ల గురించి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయరాదు అని సుప్రీం వార్నింగ్ ఇచ్చింది. చరిత్ర తెలియకుండా, ఖగోళ పరిస్థితులు తెలియకుండా.. ఫ్రీడం ఫైటర్లపై వ్యాఖ్యలు చేయడం సరికాదు అని కోర్టు పేర్కొన్నది.
రాహుల్ గాంధీ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

