Lok Sabha | న్యూఢిల్లీ: ఢిల్లీలోని అధికారిక బంగళాలను ఖాళీ చేయాలని 200 మందికిపైగా మాజీ లోక్సభ సభ్యులకు నోటీసులు జారీ అయ్యాయి. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వర్గాలు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం, అనధికారికంగా ప్రభుత్వ బంగళాల్లో ఉండేవారిని ఖాళీ చేయించడానికి ఉద్దేశించిన చట్టం ప్రకారం ఈ నోటీసులను జారీ చేశారు.
వీరు త్వరగా ఖాళీ చేయకపోతే, బలవంతంగా ఖాళీ చేయించేందుకు అధికారులను పంపిస్తారు. నిబంధనల ప్రకారం, గత లోక్సభ రద్దయిననాటి నుంచి ఒక నెలలోగా ఎంపీలు తమ అధికారిక బంగళాలను ఖాళీ చేయాలి.