న్యూఢిల్లీ, జూలై 7 : ఈ సంవత్సరం మందకొడిగా ప్రారంభమైన నైరుతి రుతు పవనాలు పుంజుకున్నాయి. జూలై మొదటి వారంలో దేశమంతటా మిగులు వర్షపాతం నమోదైంది. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా డాటా ప్రకారం.. సాధారణంగా జూలై 1 నుంచి జూలై 6 వరకు నమోదయ్యే 48 మి.మీకు బదులుగా 53.3 ఎంఎం వర్షపాతం రికాైర్డెంది. ఇది 11 శాతం ఎక్కువని ఐఎండీ తెలిపింది.
ఇస్రోకు చెందిన చిత్రాలు కూడా రుతు పవనాల పునరుజ్జీవనాన్ని సూచిస్తున్నాయి. అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు, హిమాలయ పాద పర్వత ప్రాంతం వరకు క్రియాశీలక వాతావరణ వ్యవస్థల ప్రభావంతో ఉంది. దీని కారణంగా రానున్న రోజుల్లో విస్తృతంగా వర్షాలు పడుతాయని అంచనా వేస్తున్నారు. కాగా, బంగాళాఖాతంలోని అల్పపీడనం కదులుతున్నందున రానున్న 36 నుంచి 48 గంటల్లో ఒడిశా, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురువవచ్చును ఐఎండీ హెచ్చరించింది.