Monsoon | మండుటెండల నుంచి త్వరలో ఉపశమనం.. ఈ నెల 14న అండమాన్కు నైరుతి రుతుపవనాలు
Monsoon | దేశంలో భగభగ మండుతున్న ఎండల (Heat wave) నుంచి త్వరలో ఉపశమనం లభించనుందని భారత వాతావరణ కేంద్ర (IMD) తెలిపింది. నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ఈసారి ముందుగానే వచ్చే అవకాశం ఉందని, ఈ నెల 14 నుంచి 16 మధ్య రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకే అవకాశం ఉందని ప్రకటించింది. ఇది సాధారణ సమయం కంటే కొంత ముందేనని ఆ ప్రకటనలో పేర్కొన్నది.
Monsoon : దేశంలో భగభగ మండుతున్న ఎండల (Heat wave) నుంచి త్వరలో ఉపశమనం లభించనుందని భారత వాతావరణ కేంద్ర (IMD) తెలిపింది. నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ఈసారి ముందుగానే వచ్చే అవకాశం ఉందని, ఈ నెల 14 నుంచి 16 మధ్య రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకే అవకాశం ఉందని ప్రకటించింది. ఇది సాధారణ సమయం కంటే కొంత ముందేనని ఆ ప్రకటనలో పేర్కొన్నది.
నైరుతి రుతుపవనాలు ముందే రానుండటంతో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు, పశ్చిమ భారతంలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాల్లో, తూర్పు మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని ఐఎండీ చెప్పింది. అయితే ఈ సారి మే నెలలో పగటిపూట మాత్రమే కాకుండా రాత్రి సమయాల్లోనూ వేడి ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
దక్షిణ ద్వీపకల్పంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగా లేదా అంతకంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో సముద్రపు తేమతో కూడిన వేడి గాలులవల్ల ఎక్కువ ఉక్కపోత ఉంటుందని ఐఎండీ తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

