Monsoon | నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది సరైన సమయంలోనే కేరళను తాకనున్నాయి. అయితే, ఈసారి మాత్రం ఆగస్టు తర్వాతే భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. వాస్తవానికి రుతుపవనాలు చురుగ్గా మారి.. ఎల్నినో ముగిసి లా నినా క్రియాశీలకంగా మారడంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వాతావరణశాస్త్రవేత్తల ప్రకారం.. ఎల్ నినో ప్రభావం వచ్చేవారంలోగా తగ్గుతుంది. ఆ తర్వాత లా నినా ప్రభావం మొదలవుతుంది. దాంతో రుతుపవనాల సీజన్లో వర్షాలు కురుస్తాయని.. భారీ వర్షాలు ఆస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
వచ్చే వారం రోజుల్లో పసిఫిక్ మహాసముద్రంలోని ఎల్ నినో ప్రభావం పూర్తిగా ముగియబోతుందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్కు చెందిన అక్షిత్ గోయల్ తెలిపారు. ఆ తర్వాత మార్పు ప్రక్రియ మొదలవుతుందని.. లా నినా ప్రభావం ఏర్పడుతుందని చెప్పారు. ఈ క్రమంలో రుతుపవనాలపై సానుకూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఎల్ నినో, లా నినా నమూనాల్లో ఒకటి ముగిసి మరో పరిస్థితి రావడానికి కనీసం 60 నుంచి 90 రోజులు పడుతుందని.. అలాంటి పరిస్థితుల్లో ఎల్ నినో, లా నినా ప్రభావం ఈ వర్షాకాలం సీజన్లో కనిపించిందని చెబుతున్నారు. రుతుపవనాల సమయానికి లా నినో కార్యకలాపాలు పెరిగి భారీ వర్షాలు ప్రారంభమవుతాయి.
ఈ ఏడాది రుతుపవనాలు సాధారణం కంటే మెరుగ్గా కనిపించడానికి ఇదే కారణమని సీఎస్ఈ వాతావరణ నిపుణుడు అక్షిత్ పేర్కొన్నారు. గతేడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిశాయన్నారు. కానీ, పసిఫిక్ మహాసముద్రం దిగువన ఉన్న లా నినా ప్రభావంతో ఈసారి మెరుగైన వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. శాస్త్రవేత్తల ప్రకారం.. ఎల్ నినో ప్రభావం రుతుపవనాలలో 2020 నుంచి 2023 వరకు కనిపించింది. కానీ ఈ సంవత్సరం లా నినా ప్రభావం జూలై నుంచి ఆగస్టు నెలల్లో కనిపిస్తుంది. ఆగస్టు తర్వాత ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
జూన్లో దేశంలో సాధారణ వర్షపాతం (దీర్ఘకాలిక సగటు 166.9 మి.మీ.లో 92-108శాతం) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహాపాత్ర తెలిపారు. దక్షిణ ద్వీపకల్ప భారతంలోని కొన్ని ప్రాంతాలు మినహా, జూన్లో దేశంలో సాధారణ-సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయని ఆయన చెప్పారు. వాతావరణ శాఖ నిపుణుల ప్రకారం.. ఎల్ నినో ముగిసి.. లా నినా జూలై నెల నుంచి అభివృద్ధి చెందుతుంది. పూర్తిగా లా నినా పరిస్థితులు ఇది పూర్తిగా అభివృద్ధి చెందినప్పుడు, రుతుపవనాల కార్యకలాపాలతో భారీ వర్షాల పెరుగుతాయి. జులై తర్వాత ఆగస్టు, అక్టోబర్ మాసాల్లో మరింత ఉధృతం అవుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.