సాధారణంగా చాలా కాలం తర్వాత మన కుటుంబ సభ్యులనో, స్నేహితులనో కలిస్తే ఏం చేస్తాం? వాళ్లను కౌగిలించుకొని మన దగ్గరితనం చూపిస్తాం. ఒక్కోసారి జంతువులు కూడా ఇలాగే ప్రవర్తిస్తాయి. తాజాగా ఒక కోతి కుటుంబం చాలా కాలం తర్వాత కలిసింది. రెండు పెద్ద కోతులు తమ వీపుపై రెండు పిల్లకోతులను వేసుకొని వచ్చాయి.
అలా రెండూ కలవగానే ఒకదాని వీపుపై ఉన్న పిల్లను తీసుకొని ఎత్తుకుంది ఎదుటి కోతి. ఆ తర్వాత రెండూ ఒకదాన్ని ఒకటి కౌగిలించుకొని కూర్చుకున్నాయి. అలాగే స్నేహంగా ఉన్నప్పుడు కోతులు చేసే చప్పుడు చేస్తూ సంతోషం వ్యక్తం చేశాయి. ఐఎఫ్ఎస్ అధికారి షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
‘‘కరోనా ప్యాండెమిక్ తర్వాత తొలిసారి కలిసిన కుటుంబం’’ అని ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద దీనికి క్యాప్షన్ ఇచ్చారు. దీన్ని చూసిన నెటిజన్లు.. కోతులు కూడా అచ్చం మనుషుల్లాగే రియాక్ట్ అవుతున్నాయని, అది చూసి చాలా ఆశ్చర్యం కలుగుతోందని కామెంట్లు చేస్తున్నారు.
When family met after the pandemic😌☺️ pic.twitter.com/sDxFHXr1z9
— Susanta Nanda IFS (@susantananda3) May 30, 2022