MPox | కొద్దినెలలుగా మంకీపాక్స్ ప్రపంచాన్ని వణికిస్తున్నది. ఆఫ్రికాతో పాటు అమెరికాలోనే భారీగానే కేసులు నమోదయ్యాయి. తాజాగా భారత్‌లోనూ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే రెండుకేసులు నమోదు కాగా.. తాజాగా మరో కేరళలో వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది. సదరు వ్యక్తి విదేశాల నుంచి వచ్చినట్లు తెలుస్తున్నది. ఎర్నాకుళానికి వచ్చిన వ్యక్తిలో లక్షణాలు కనిపించడంతో అతను కోచిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు. ఇటీవల మల్లప్పురానికి చెందిన 38 వ్యక్తి మంకీపాక్స్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. సదరు వ్యక్తికి క్లాడ్ 1బీ వేరియంట్ సోకినట్లుగా తేలింది. ఎర్నాకుళానికి చెందిన వ్యక్తి ఇటీవల యూఏఈ నుంచి వచ్చినట్లు సమాచారం . ఆ తర్వాత తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. వైద్యులు శరీరంపై దద్దుర్లు కనిపించడంతో నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు.
ఇంతకు ముందు ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకగా.. ప్రమాదకరమైన క్లాడ్ 21బీ వేరియంట్ సోకినట్లు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ వేరియంట్ కారణంగా కేసులు వేగంగా పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఆ తర్వాత గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అడ్వైజరీని జారీ చేశారు. వైరస్‌ని కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని.. మంకీపాక్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలందరూ తప్పనిసరిగా రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. అనుమానిత వ్యక్తులు, వైరస్ సోకిన వ్యక్తులను ఐసోలేషన్‌కు తరలించాలని.. లక్షణాలు కనిపిస్తే నమూనాలను సేకరించి ల్యాబ్‌లకు పంపాలన్నారు. ఎంపాక్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదని.. నివారణ చర్యలు పాటిస్తే ప్రమాదం నుంచి బయటపడవచ్చన్నారు. అనుమానిత కేసుల విషయంలో ఆలస్యం చేస్తే.. వైరస్ మరింత మందికి సోకే అవకాశం ఉంటుందని.. సమయం వృథా చేయొద్దని సూచించారు.