Ram Temple | అయోధ్యలో నిర్మించిన రామ మందిరం (Ram Temple)లో బాలరాముడు కొలువుదీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి రామ్‌లల్లా దర్శనానికి సాధారణ భక్తులకు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రాముడి దర్శనానికి ఊహించని అతిథి వచ్చారు. ఆ అతిథి ఎవరో కాదు వానరం (Monkey). ఈ విషయాన్ని ఆలయ ట్రస్ట్ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
మంగళవారం సాయంత్రం 5:50 గంటల సమయంలో ఆలయంలోకి ఓ వానరం (కోతి) వచ్చినట్లు తెలిపింది. దక్షిణ ద్వారం గుండా గర్భగుడిలోకి ప్రవేశించినట్లు తెలిపింది. రాముడి విగ్రహం సమీపం వరకూ వెళ్లడంతో అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది కోతిని పట్టుకునేందుకు వెళ్లినట్లు చెప్పింది. అయితే, ఆ వానరం ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా ఉత్తర ద్వారం వైపు నుంచి బయటకు వెళ్లిపోయినట్లు వివరించింది. తన రాముడిని చూసేందుకు హనుమంతుడే (Lord Hanuman) వచ్చాడంటూ ట్రస్ట్ తన ట్వీట్లో చెప్పుకొచ్చింది. ఊహించని అతిథి రాకాతో అక్కడున్న భక్తులు, ఆలయ పూజారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
आज श्री रामजन्मभूमि मंदिर में हुई एक सुंदर घटना का वर्णन:
आज सायंकाल लगभग 5:50 बजे एक बंदर दक्षिणी द्वार से गूढ़ मंडप से होते हुए गर्भगृह में प्रवेश करके उत्सव मूर्ति के
पास तक पहुंचा। बाहर तैनात सुरक्षाकर्मियों ने देखा, वे बन्दर की ओर यह सोच कर भागे कि कहीं यह बन्दर उत्सव…— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 23, 2024
Also Read..
Canada | కుప్పకూలిన కార్మిక విమానం.. ఆరుగురు మృతి
Ram Mandir | రామ మందిరానికి భారీ విరాళం అందించిన అంబానీ కుటుంబం..?
Heart Attack | జై శ్రీరామ్ అని నినదిస్తూ గుండెపోటుతో మృతిచెందిన హనుమ వేషధారి..!