Canada | కెనడా (Canada)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కార్మికులతో వెళ్తున్న ఓ విమానం టేకాఫ్ అయిన కాసేపటికి కుప్ప కూలిపోయింది (Plane Crash). ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. నార్త్‌వెస్ట్ టెరిటరీస్ (Northwest Territories)లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
పోర్ట్‌స్మిత్ (Fort Smith) నుంచి కార్మికులతో రియో టింటో మైనింగ్ సంస్థకు చెందిన దియావిక్ వజ్రాల గని ( Diavik diamond mine ) వద్దకు ఆ విమానం బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన కాసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌తో దానికి సంబంధాలు తెగిపోయాయి. అనంతరం కుప్పకూలిపోయినట్లు అధికారులు తెలిపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు తెలిపింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
Also Read..
Ram Mandir | రామ మందిరానికి భారీ విరాళం అందించిన అంబానీ కుటుంబం..?
India Vs England: ఇంగ్లండ్‌తో టెస్టులకు… కోహ్లీ స్థానంలో కొత్త ప్లేయర్ ఎవరంటే?