Heart Attack | జై శ్రీరామ్ అని నినదిస్తూ గుండెపోటుతో మృతిచెందిన హనుమ వేషధారి..!
Heart Attack | అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశ ప్రజలంతా ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ ప్రాణప్రతిష్ఠ వేడుకలను పురస్కరించుకుని హర్యానా రాష్ట్రంలోని భివానీలో ‘రాంలీల’ నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నాటక ప్రదర్శనలో విషాదం చోటుచేసుకుంది. అప్పటిదాకా తన నటనతో, హావభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్న హనుమ వేషధారి గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
Heart Attack: అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశ ప్రజలంతా ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ ప్రాణప్రతిష్ఠ వేడుకలను పురస్కరించుకుని హర్యానా రాష్ట్రంలోని భివానీలో ‘రాంలీల’ నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నాటక ప్రదర్శనలో విషాదం చోటుచేసుకుంది. అప్పటిదాకా తన నటనతో, హావభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్న హనుమ వేషధారి గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 22న హర్యానాలోని భివానీ పట్టణంలో ‘రాంలీల’ నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ నాటకంలో 62 ఏళ్ల హరీష్ అనే వ్యక్తి హనుమంతుని పాత్ర పోషించాడు. జైశ్రీరామ్ నినాదాలు చేస్తూ వేదికపై గంతులు వేస్తున్న హరీష్‌కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా రాముడి వేషధారి ముందు కుప్పకూలాడు.
అయితే ఆ నాటక ప్రదర్శన నిర్వహిస్తున్న వారు, నాటకాన్ని చూస్తున్న ప్రేక్షకులు హరీష్ తన నటనలో భాగంగానే అల పడిపోయాడని, శ్రీరాముడి ఆశీర్వాదాలు తీసుకుంటున్నాడని భావించి చప్పట్లు కొట్టారు. కానీ, ఎంత సేపటికీ హరీష్ పైకి లేవకపోవడంతో అనుమానం వచ్చి చూడగా అతను స్పృహలో లేడు. దాంతో వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అతను అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ఈ నెల 22న జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bhivani
- Hanuman Role
- harish
- haryana
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

