Mahua Moitra | న్యూఢిల్లీ, డిసెంబర్ 7: ప్రశ్నలు అడగడానికి డబ్బులు తీసుకున్నారన్న కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదిక శుక్రవారం పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశం ఉన్నదని పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 4న ఈ అంశాన్ని అజెండాలో ఉంచినా చర్చించలేదు.
మొయిత్రా సస్పెన్షన్ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకొనే ముందు చర్చ జరగాలని పలువురు విపక్ష సభ్యులు కోరుతున్నారు. ఎథిక్స్ కమిటీలోని ఆరుగురు సభ్యులు నివేదికకు అనుకూలంగా ఓటేశారు. విపక్షాలకు చెందిన నలుగురు సభ్యులు అసమ్మతి నోట్‌ను సమర్పించారు. ఈ నివేదికను విపక్ష సభ్యులు ‘ఫిక్స్డ్ మ్యాచ్’గా పేర్కొన్నారు. ఆరోపణలకు మద్దతుగా చిన్న ఆధారం కూడా లేదన్నారు.