NTA | పరీక్షల నిర్వహణలో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ ఉన్నత స్థాయి నిపునుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇస్రో మాజీ చైర్మన్ కే రాధాకృష్ణన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీని నియమించినట్లు ఈ మేరకు విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ కమిటీ రెండు నెలల్లో దర్యాప్తు నివేదికను అందజేస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. యూజీసీ నెట్ లీకేజీ కారణంగా రద్దు, నీట్ అవకతవకలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విద్యామంత్రిత్వ శాఖ పారదర్శకంగా ఉండాలా చూసేందుకు ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణ నేతృత్వంలో నిపుణుల ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.
పరీక్షలను సజావుగా, న్యాయబద్ధంగా నిర్వహించడం, యంత్రంగాన్ని మెరుగుపరచడం, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను మెరుగుపరచడం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరుపై సిఫారసులు చేయనున్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ బీజే రావు, ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ రెండు నెలల్లో తన నివేదికను విద్యా మంత్రిత్వ శాఖకు సమర్పించనుంది.