(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): 2014లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు.. ఆర్భాటం కోసం కుప్పలుతెప్పలుగా పథకాలను ప్రవేశపెట్టింది. అయితే, అమలులో మాత్రం ఆయా పథకాలు లక్ష్యాలను చేరుకోలేకపోగా.. తీరని ఆర్థిక భారంగా మిగిలాయి. ఈ మేరకు ఆయా సందర్భాల్లో కాగ్, నీతిఆయోగ్ వంటి మేథో సంస్థలు విడుదల చేసిన నివేదికలను విశ్లేషిస్తే అర్థమవుతున్నది.
పథకం: స్వచ్ఛభారత్ మిషన్ (2014)
ఉద్దేశ్యం: బహిరంగ మలవిసర్జన రహిత భారత్
బడ్జెట్: రూ. 1.4 లక్షల కోట్లు
స్కీమ్ డెడ్‌లైన్: 2019
ప్రస్తుత స్థితి: 60 శాతం ఇండ్లల్లో టాయ్లెట్లు లేవు
పథకం: స్మార్ట్ సిటీస్ (2015)
ఉద్దేశ్యం: పౌరుల జీవన ప్రమాణాలను పెంచి, నగరాల్లో ఆర్థిక ప్రగతికి దోహదపడటం
బడ్జెట్: రూ. 2 లక్షల కోట్లు
స్కీమ్ డెడ్‌లైన్: 2020 నుంచి 2025కి పొడిగింపు
ప్రస్తుత స్థితి: వంద సిటీల్లో హైటెక్ సేవలు అందిస్తామని చేతులెత్తేశారు.
పథకం: డిజిటల్ ఇండియా (2015)
ఉద్దేశ్యం: ప్రజల అరచేతిలో ప్రభుత్వ సేవలు, డిజిటల్ అక్షరాస్యత పెంచడం
బడ్జెట్: రూ. 1.5 లక్షల కోట్లు
స్కీమ్ డెడ్‌లైన్: 2024
ప్రస్తుత స్థితి: డిజిటల్ సేవలేమో గానీ
నిమిషానికి 500 సైబర్ దాడులు
జరుగుతున్నాయి.
పథకం: జల్‌జీవన్ మిషన్ (2019)
ఉద్దేశ్యం: ప్రతీ ఇంటికి నల్లా నీళ్లు
బడ్జెట్: రూ. 45 వేల కోట్లు
స్కీమ్ డెడ్‌లైన్: 2022
ప్రస్తుత స్థితి: పలు రాష్ర్టాల్లో సగం ఇండ్లకు కూడా నల్లా లేదు
పథకం: మిషన్ శక్తి (2021)
ఉద్దేశ్యం: మహిళా భద్రత-సాధికారత
బడ్జెట్: రూ. 3,150 కోట్లు
స్కీమ్ డెడ్‌లైన్: 2024
ప్రస్తుత స్థితి: రోజుకు సగటున 82 మంది మహిళలపై రేప్‌లు జరుగుతున్నాయి
పథకం: ఆయుష్మాన్ భారత్ (2018)
ఉద్దేశ్యం: ప్రతీఒక్కరికీ ఉచిత వైద్యం
బడ్జెట్: రూ. 99 వేల కోట్లు
స్కీమ్ డెడ్‌లైన్: 2024
ప్రస్తుత స్థితి: నకిలీ క్లెయిమ్‌లతో వేల కోట్లు దారిమళ్లాయి.
పథకం: మిషన్ కర్మయోగి (2020)
ఉద్దేశ్యం: ప్రభుత్వ
ఉద్యోగుల నైపుణ్యాలు మెరుగుపర్చడం
బడ్జెట్: రూ. 510 కోట్లు
స్కీమ్ డెడ్‌లైన్: 2024
ప్రస్తుత స్థితి: ఒక్క కర్ణాటకలోనే 75 శాతం మంది ప్రభుత్వోద్యోగులకు
ఈ-మెయిల్ పంపించడం కూడా రాదు.