న్యూఢిల్లీ : ఎన్నికల ముంగిట ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రధాని మోదీ ఆరాటపడుతున్నారు. ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ పేరుతో దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన రథాలతో దేశవ్యాప్తంగా లబ్ధిదారులను కలిసి, ఈ పథకాల్లో చేర్చాలని ఆదేశించారు.