త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్‌లోని ఔరంగాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన ఒక బహిరంగ సభ ప్రధాని మోదీకి షాకిచ్చింది. నిర్వాహకులు సభా ప్రాంగణంలో 30 వేల కుర్చీలు వేయగా, సభకు పట్టుమని 400 మంది లోపే హాజరయ్యారు.
ఖాళీ కుర్చీలను చూసి విస్తుపోయిన మోదీ సభ రద్దు చేస్తే పరువుపోతుందని భావించారో ఏమో.. ఖాళీ కుర్చీలను ఉద్దేశించే ప్రసంగించి బతుకుజీవుడా అంటూ వెనుదిరిగారు!