పాట్నా, అక్టోబర్ 29: ఓట్ల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎటువంటి నాటకాలైనా వేస్తారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా ముజఫర్‌పూర్‌లో తొలి ప్రచార ర్యాలీలో పాల్గొన్న రాహుల్ ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓట్ల కోసం మోదీ ఏ నాటకమైనా వేయగలరు.
ఆయనకు కేవలం ఓట్లు మాత్రమే కావాలి. డ్యాన్స్ చేయమని మీరు నరేంద్ర మోదీని అడిగితే ఆయన అది కూడా చేస్తారు అంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ని అడ్డం పెట్టుకుని రిమోట్ కంట్రోల్ ద్వారా బీహార్‌లో ప్రభుత్వాన్ని బీజేపీ నడిపిస్తోందని ఆయన తీవ్రంగా ఆరోపించారు.