న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్ పరిస్థితిలో ఆశించిన మార్పులు తెచ్చేందుకు అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా కృషి చేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. అఫ్గాన్ భూభాగం ఉగ్రవాదానికి స్థావరం కాకూడదని పేర్కొన్నారు. అఫ్గాన్‌పై జీ20 ప్రత్యేక సదస్సును ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. అఫ్గాన్‌లో సమ్మిళిత ప్రభుత్వం ఏర్పడాలన్నారు.
మానవ హక్కులతో రాజకీయం ప్రమాదకరం
మానవ హక్కుల ఉల్లంఘన అంశం పేరుతో దేశ ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూసే వ్యక్తుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. అలాంటి వ్యక్తులకు ఒక ఘటనలో మానవ హక్కుల ఉల్లంఘన కనిపిస్తుందని, అలాంటిదే మరో ఘటనలో మాత్రం కనిపించదని విమర్శించారు. ఎన్‌హెచ్చార్సీ 28వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మోదీ మాట్లాడారు.