Arvind Kejriwal | వచ్చే ఏడాది మోదీకి 75 ఏళ్లు, పదవీ విరమణ చేస్తారా?: అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal | బెయిల్‌పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ, ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. వచ్చే ఏడాది మోదీకి 75 ఏళ్లు నిండుతాయని అప్పుడు పదవీ విరమణ చేస్తారా? బీజేపీ ప్రధానిగా ఎవరు ఉంటారు? అని ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: బెయిల్‌పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) బీజేపీ, ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. వచ్చే ఏడాది మోదీకి 75 ఏళ్లు నిండుతాయని అప్పుడు పదవీ విరమణ చేస్తారా? బీజేపీ ప్రధానిగా ఎవరు ఉంటారు? అని ప్రశ్నించారు. శనివారం మీడియా సమావేశంలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. ‘ఇండియా బ్లాక్ ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరని బీజేపీ అడుగుతోంది? అయితే వారి ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరని బీజేపీని నేను అడుగుతున్నా?’ అని అన్నారు.
కాగా, 2025 సెప్టెంబర్ 17న మోదీకి 75 ఏళ్లు నిండుతాయని కేజ్రీవాల్ తెలిపారు. 75 ఏళ్ల తర్వాత బీజేపీలోని నేతలు రిటైర్ కావాలన్న నిబంధన మోదీ పెట్టారని చెప్పారు. ‘లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహాజన్, యశ్వంత్ సిన్హా రిటైర్ అయ్యారు. అలాగే వచ్చే ఏడాది సెప్టెంబర్ 17న మోదీ రిటైర్ కాబోతున్నారా?’ అని అన్నారు.
మరోవైపు కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే తొలుత యోగి ఆదిత్యనాథ్‌ను గద్దె దించుతారని, ఆ తర్వాత అమిత్ షాను దేశానికి ప్రధానిని చేస్తారని కేజ్రీవాల్ తెలిపారు. ‘అమిత్ షా కోసం ప్రధాని మోదీ ఓట్లు అడుగుతున్నారు. మోదీ హామీలను అమిత్ షా నెరవేరుస్తారా?, మోదీకి గ్యారెంటీ ఎవరు అందిస్తారు? మీ హామీలను అమిత్ షా నెరవేరుస్తారా?’ అని ప్రశ్నించారు. బీజేపీ ఓటర్లు మోదీకి ఓటు వేయబోరని, అమిత్ షాకు ఓటు వేయబోతున్నారన్నది వారు అర్థం చేసుకోవాలని కేజ్రీవాల్ అన్నారు.
#WATCH | Delhi CM Arvind Kejriwal says "…These people ask the INDIA alliance who will be their Prime Minister. I ask BJP who will be your Prime Minister? PM Modi is turning 75, on 17th September. He made a rule that leaders in the party would retire after 75 years…LK Advani,… pic.twitter.com/P1qYOl7hIt
— ANI (@ANI) May 11, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

