Modi – Trump | మోడీకి ట్రంప్ ఫోన్ కాల్.. హర్మూజ్ జలసంధి, ద్వైపాక్షిక సంబంధాలపై సంభాషణ..!
Modi - Trump : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను నిలువరించేందుకు మధ్యవర్థిత్వం వహించి పాకిస్థాన్ విఫలమైన వేళ.. భారత ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఫోన్లో మాట్లాడుకున్నారు.
Modi – Trump : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను నిలువరించేందుకు మధ్యవర్థిత్వం వహించి పాకిస్థాన్ విఫలమైన వేళ.. భారత ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఫోన్లో మాట్లాడుకున్నారు. ఫోన్లో నలభై నిమిషాల పాటు సంభాషించుకున్న ఇరువురు హర్మూజ్ జలసంధి, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం గురించి చర్చించుకున్నారు. ట్రంప్ తనకు ఫోన్ చేశారని, ఇద్దరి మధ్య ద్వైపాక్షిక అంశాలు ప్రస్తావనకు వచ్చాయని మంగళవారం ఎక్స్ వేదికగా మోడీ పంచుకున్నారు.
ఇరాన్, అమెరికా మధ్య రెండో దఫా చర్చల వార్తలు ఊపందుకున్న వేళ భారత ప్రధాని నరేంద్ర మోడీతో డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది. హర్మూజ్ జలసంధి సంరక్షణ, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై మోడీ, ట్రంప్ చర్చించుకున్నారు.
Received a call from my friend President Donald Trump. We reviewed the substantial progress achieved in our bilateral cooperation in various sectors. We are committed to further strengthening our Comprehensive Global Strategic Partnership in all areas. We also discussed the…
— Narendra Modi (@narendramodi) April 14, 2026
‘నా స్నేహితుడు డొనాల్ట్ ట్రంప్ నుంచి ఫోన్ వచ్చింది. భారత్ అమెరికా మధ్య వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారం గురించి ఇద్దరం మాట్లాడుకున్నాం. భవిష్యత్‌లో అన్ని విభాగాల్లో ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఇద్దరం కట్టుబడి ఉన్నాం. పశ్చిమాసియాలోని పరిస్థితులపై, హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షితంగా ఉంచడం ఎంత ముఖ్యమో కూడా చర్చించాం’ అని మోడీ ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

