50 శాతాన్ని బ్రేక్ చేయండి.. మోదీ సర్కార్ ఎందుకు భయపడుతోంది?

న్యూఢిల్లీ: లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లుపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం మార్క్‌ను బ్రేక్ చేయాలన్నారు. కోటా గోడను దాటేందుకు మోదీ సర్కార్ ఎందుకు భయపడుతోందని అసద్ అన్నారు. జబ్ ప్యార్ కియాతో డర్నా క్యా.. తోడ్ జాయియే 50 పర్సత్కో అంటూ ఎంపీ అసద్ కామెంట్ చేశారు. ఓబీసీలతో మీకు ప్రేమ లేదని, వారి ఓట్లతో మీకు ప్రేమ ఉందని విమర్శించారు. ఓ బిల్లుతో సుప్రీం తీర్పును నొక్కిపెట్టినప్పుడు, ఇక షా బాను కేసు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. కేవలం కొందరు ఓబీసీలకు మాత్రమే ప్రభుత్వం మద్దతు ఇస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తోందని, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ ముస్లింలను విస్మరిస్తోందన్నారు.
ప్రో యాక్టివ్ రీతిలో మోదీ సర్కర్ 50 పర్సెంట్ సీలింగ్‌ను బ్రేక్ చేయాలన్నారు. ఇదో అద్భుత అవకాశమని, ఓబీసీ సమాజానికి న్యాయం చేయాలని అసద్ కోరారు. సభలో కేవలం మరాఠాల గురించే మాట్లాడుతారా.. మహారాష్ట్రలోని ముస్లింల గురించి ఎందుకు మాట్లాడడం లేదన్నారు. ఇఫ్తార్ల దావత్ తప్ప ముస్లింలకు రిజర్వేషన్లు దొరకవా అని ఎంపీ అసద్ అడిగారు. 89 మంది సెక్రటరీల్లో.. ఎంత మంది ఓబీసీలు ఉన్నారని ఆయన ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

