Sonia Gandhi : కాంగ్రెస్ పార్టీ (Congress party) అగ్ర నాయకురాలు (Top leader) సోనియాగాంధీ (Sonia Gandhi) కేంద్ర ప్రభుత్వ (Union govt) విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆరావళి పర్వతాల భౌగోళిక స్వరూపాన్ని మార్చేలా కేంద్రం తీసుకుంటున్న చర్యలు సహజ సంపదకు డెత్ వారెంట్ (Death warrant) అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
వంద మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న కొండల్లో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చంటూ ఆరావళి పర్వతాల విషయంలో కేంద్ర పర్యాటక శాఖ కొత్త మార్పులు తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలోనే సోనియాగాంధీ ఓ జాతీయమీడియా సంస్థకు రాసిన కథనంలో ఆందోళన వ్యక్తంచేశారు. ఆ కథనంలోని కొన్ని లైన్స్‌ను కాంగ్రెస్ షేర్ చేసింది.
గుజరాత్, రాజస్థాన్, హర్యానాల్లో విస్తరించి ఉన్న ఆరావళి పర్వతాలది దేశ చరిత్ర, భౌగోళిక స్వరూపంలో కీలక పాత్ర అని సోనియాగాంధీ పేర్కొన్నారు. అక్రమ మైనింగ్ వల్ల ఇప్పటికే వాటి సహజ సంపద తరిగిపోతుండగా.. మోదీ ప్రభుత్వం వాటికి డెత్ వారెంట్ ఇచ్చిందని విమర్శించారు. 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న కొండల్లో మైనింగ్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది.
కేంద్రం చర్య మైనర్లకు, మాఫియాకు బహిరంగ ఆహ్వానమని, ప్రభుత్వ విధానాల్లో పర్యావరణంపై నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని సోనియా విమర్శించారు. ఇది వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. వెంటనే ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే కేంద్రం తీసుకువచ్చిన మార్పులను సుప్రీంకోర్టు అంగీకరించింది.
అదేవిధంగా అక్రమ మైనింగ్‌ను నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చేసిన సిఫారసులను పరిశీలించేందుకు కూడా సర్వోన్నత న్యాయస్థానం ఓకే చెప్పింది. సుస్థిర మైనింగ్ కోసం నిర్వహణ ప్లాన్‌ను సిద్ధం చేయాలని పర్యావరణ మంత్రిత్వశాఖను ఆదేశించింది. ఈ ప్లాన్ ఖరారయ్యే వరకు మైనింగ్ కోసం కొత్తగా లీజులు ఇవ్వకూడదని ఆదేశాల్లో పేర్కొంది.