కేంద్రంలో అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచి సామాన్యుడి నడ్డి విరిచిన మాట వాస్తవమేనని పార్లమెంట్ వేదికగా మోదీ సర్కారు అంగీకరించింది.
2014లో లీటరుకు పెట్రోలుపై రూ.9.48, డీజిల్పై 3.56 ఎక్సైజ్ పన్ను ఉండగా.. తమ పాలనలో 2020 నాటికి పెట్రోలుపై లీటరుకు రూ.32.98కి, డీజిల్పై రూ.31.83కు ఎక్సైజ్ పన్నును పెంచామని వెల్లడించింది. రాజ్యసభలో ఒక ప్రశ్నకు పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.