Chinnaswamy Stampede : చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాటపై ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతేకాదు ఆత్మీయులను కోల్పోయిన ఫ్యామిలీస్కు కేంద్ర తరఫున రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వాళ్లకు రూ. 50 వేల పరిహారం చెల్లిస్తామని మోడీ వెల్లడించారు.
కర్నాటక ప్రభుత్వం కూడా తొక్కిసలాట మృతులకు నష్టపరిహారం ప్రకటించింది. ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేసిన కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) బౌరింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వాళ్లను పరామర్శించారు. ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాదంలో మృతి చెందిన వాళ్ల కుటుంబాలకు రూ. 10 లక్షల నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు.
ಮುಖ್ಯಮಂತ್ರಿ @siddaramaiah ಅವರು ಬೌರಿಂಗ್ ಹಾಗೂ ವೈದೇಹಿ ಆಸ್ಪತ್ರೆಗೆ ಭೇಟಿ ನೀಡಿ ಚಿನ್ನಸ್ವಾಮಿ ಕ್ರೀಡಾಂಗಣದ ಬಳಿ ಕಾಲ್ತುಳಿತಕ್ಕೆ ಸಿಲುಕಿ ಗಾಯಗೊಂಡವರ ಯೋಗಕ್ಷೇಮ ವಿಚಾರಿಸಿ, ಮೃತರ ಕುಟುಂಬದವರಿಗೆ ಸಾಂತ್ವನ ಹೇಳಿದರು. pic.twitter.com/ereHQbTPHl
— CM of Karnataka (@CMofKarnataka) June 4, 2025
‘చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఊహించని రీతిలో అభిమానులు తరలి రావడంతో ఈ దురదృష్టకరమైన ఘటన జరిగింది. దాదాపు 3 లక్షల మంది జనం రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల నష్టపరిహారం చెల్లిస్తాం. గాయపడినవాళ్లకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తాం’ అని సిద్ధరామయ్య తెలిపారు. అంతేకాదు తొక్కిసలాటపై న్యాయ విచారణకు ఆయన ఆదేశించారు.
చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. సరైన భద్రతా ఏర్పాట్లు చేయడంలో కర్నాటక సర్కార్ విఫలమైంది. భారీగా తరలివచ్చిన అభిమానులను నియంత్రించలేకపోయారు పోలీసులు. ఒక్కసారిగా స్టేడియం గేట్లు తెరవడంతో భారీకేడ్లను తోసుకుంటూ మరీ స్టేడియంలోకి దూసుకొచ్చారు ఫ్యాన్స్. అంతే.. వాళ్లను కంట్రోల్ చేసేందుకు లాఠీ ఛార్జ్ చేసినా అప్పటికే నష్టం జరిగిపోయింది.
#Bengaluru #RCB#RCBvPBKS #IPL2025#Stampede #chinnaswamystadium
“Despite warnings from senior police officials, the @Siddaramaiah govt rushed into the event near Vidhana Soudha for publicity. Now, 12 lives are lost. Who will take responsibility?” @BYVijayendra @DKShivakumar pic.twitter.com/Se4iAjBw91
— INDIA NOW (@indianowme) June 4, 2025
సొమ్మసిల్లి పడిపోయిన వాళ్లలో 11 మంది మృతి చెందారు. వీళ్లలో నలుగురు మహిళలు, ఒక బాలుడు ఉన్నట్టు సమాచారం. తీవ్రంగా గాయపడిన 33 మందికి బౌరింగ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. అంతుకుముందు.. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని.. ఈ విచారకరమైన సంఘటనకు తమదే బాధ్యత అని డిప్యూటీ సీఏం డీకే శివకుమార్ ఓ ప్రకటనలో చెప్పారు.