తిరుపతి: ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ నెల 13 నుంచి ప్రారంభమయ్యే మహా కుంభ మేళాకు హాజరయ్యే భక్తులు తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని దర్శనం చేసుకోవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు శనివారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. టీటీడీ నమూనా ఆలయాన్ని మహా కుంభ మేళాలోని సెక్టర్-6లో వాసుకి ఆలయం పక్కన నిర్మిస్తున్నారు.
తిరుమలలోని శ్రీవారి ఆలయంలో జరిగే శ్రీవారి కల్యాణోత్సవాలు, చక్రస్నానం వంటి కైంకర్యాలను ఇక్కడ కూడా నిర్వహించనున్నారు. కుంభమేళాలోని టీటీడీ ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించనున్నట్లు బీఆర్ నాయుడు తెలిపారు.